Posted On: Friday, December 7, 2018

TS TSPSC VRO Results 2018 : వీఆర్వో పరీక్ష ఫలితాలు విడుదల

Organization Vacancy Qualifications Last Date
Examination Name TS TSPSC VRO 2018 Results
Exam Date 16th September 2018
Answer Key Release Date 17th October 2018
No Of Posts 700
Results Status 6th December 2018

telangana state vro results 2018 released check here

తెలంగాణలో వీఆర్వో ఉద్యోగ నియామక రాతపరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ గురువారం (డిసెంబరు 6) వెల్లడించింది. ఈ మేరకు రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను ప్రకటించింది. అభ్యర్థుల మార్కులు, ర్యాంకులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్వో ఉద్యోగాల కోసం సెప్టెంబర్‌ 16న నిర్వహించిన రాతపరీక్ష నిర్వహించగా.. మొత్తం 7,87,049 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 7,38,885 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరికి సంబంధించిన మార్కులు, ర్యాంకులను కమిషన్‌ ప్రకటించింది. ఒక్కో ఉద్యోగానికి ముగ్గురిని ఎంపిక చేసి జిల్లాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు టీఎస్‌పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్వో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 16న రాతపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రాథమిక (ప్రిలిమినరీ) 'కీ'ని సెప్టెంబర్ 22న విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది ‘కీ’ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రాథమిక 'కీ'పై అభ్యంతరాలను సెప్టెంబరు 24 నుంచి 30 వరకు స్వీకరించారు. తుది ‘కీ’ వెల్లడించిన నేపథ్యంలో వీఆర్‌వో పోస్టుల రాత పరీక్ష ఫలితాలను డిసెంబరు 6న వెల్లడించారు.
వెబ్‌నోట్ కోసం క్లిక్ చేయండి..
Share: